జూన్ 11 నుంచి సాకర్ సంబరాలు-ఫిఫా వరల్డ్ కప్ 2026
అమరావతి: అమెరికా,కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా పుట్ బాల్ టోర్నీ ప్రసార హక్కులను జీ మీడియా సంస్థ పొందింది. ఫిఫా-జీల మధ్య ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది.2034 వరకూ భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను జీ సంస్థ టెలీకాస్ట్ చేస్తుంది.అలాగే ఫిఫాకు సంబంధించిన 34 ఈవెంట్లను కూడా ఈ సంస్థ ప్రసారం చేయనుంది.2026 మెగా పుట్ బాల్ టోర్నీలో 48 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
జీ సంస్థ రూ.500 కోట్లకు:- వరల్డ్ కప్ ప్రసార హక్కులను ఫిఫా రూ.948 కోట్లు అమ్మాలనుకుంది.కాని రూ.500 కోట్లకు జీ సంస్థ ప్రసార హక్కులు సొంతం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఖతార్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌ను రిలయన్స్-డిస్నీ సంయుక్త కంపెనీ అయిన జియో హాట్‌స్టార్‌లో ప్రసారం చేశాయి. సారి కూడా రిలయన్స్ కు చెందిన వైకోమ్ 18 సంస్థ హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. రూ.200 కోట్లకు వైకోమ్ 18 బిడ్ వేయాలనుకుంది. అయితే ఫిఫా యాజమాన్యం అంత తక్కువకు వరల్డ్ కప్ మ్యాచ్ ప్రసారాలకు అంగీకరించం అని నిరాకరించింది. చివరకు..జీ సంస్థ రూ.500 కోట్లకు ప్రసార హక్కులను సొంత చేసుకంది. సాకర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్ లు జూన్ 11న ప్రారంభం కానున్నాయి.

