శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం, సుప్రీంకోర్టు
భారత్ ధర్మశాల కాదు…
అమరావతి: శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని,,భారత్ ధర్మశాల కాదు… తక్షణం శరణార్థులు దేశాన్ని వీడాలి అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది..శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది.. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.. “భారతదేశం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా ? మనం 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము..ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీయులకు వినోదం అందించగల ధర్మశాల కాదు” అని ధర్మాసనం అధ్యక్షత వహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు..“ఇక్కడ స్థిరపడటానికి మీకు ఏ హక్కు ఉంది?” అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.. పిటిషనర్ ఒక శరణార్థి అని,,అతని భార్య,, పిల్లలు భారతదేశంలో స్థిరపడ్డారని న్యాయవాది తెలిపారు..చట్టం ప్రకారం పిటిషనర్ ను అదుపులోకి తీసుకొవడం జరిగిందని,, ఆర్టికల్ 21 ఉల్లంఘన జరగలేదని జస్టిస్ దత్తా వ్యాఖ్యనించారు..ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో స్థిరపడే ప్రాథమిక హక్కు పౌరులకు మాత్రమే అందుబాటులో ఉందని జస్టిస్ దత్తా స్పష్టం చేశారు..పిటిషనర్ తన దేశంలో ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటున్నాడని న్యాయవాది చెప్పినప్పుడు,, జస్టిస్ దత్తా స్పందిస్తూ “వేరే దేశానికి వెళ్లిపో” అని అన్నారు. ఇటీవల, రోహింగ్యా శరణార్థుల బహిష్కరణలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.