బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం
అమరావతి: దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షంతో బెంగళూరు నగరం చెరువును తలపిస్తొంది..దాదాపు ఆరు గంటలకుపైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి..ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి.. కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వివరాల ప్రకారం, కెంగేరిలో అత్యధికంగా 132 మి.మీ.,బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 131.5 మి.మీ వర్షపాతం నమోదు అయింది..లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత తరలించేందుకు NDRF బృందాలు రంగంలోకి దిగాయి.బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.