NATIONALPOLITICS

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వ్యతిరేకిస్తే,చరిత్ర క్షమించదు-ప్రధాని మోదీ

రాజకీయ రంగు పూయ‌వ‌ద్దు..

అమరావతి: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును రాజ‌కీయ కోణంలో చూడ‌వ‌ద్దని, బిల్లుకు రాజకీయ రంగు పూయ‌వ‌ద్దని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కోరారు.గురువారం లోక్‌స‌భ‌లో డీలిమిటేష‌న్‌, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు.ఇప్ప‌టికే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆల‌స్యం చేశామ‌న్నారు. ఈ బిల్లుల‌ను తీసుకువ‌చ్చిన ఘనత భార‌త ప్ర‌జాస్వామ్యానికి ద‌క్కుతుందే కాని ప్రదాని మోదీకి కాదన్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవ‌రిద‌న్న దానిపై ఆలోచించ‌రాదు అన్నారు. కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోవ‌చ్చు అని ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌కు చెప్పారు. ముందుగా 33 శాతం మంది మ‌హిళ‌లు ఇక్క‌డ‌కు రావాల‌న్నారు. భార‌తీయ సోద‌రీమ‌ణులను న‌మ్మండి అలాగే వారి ఇంటెలిజెన్స్‌ ను గుర్తించాల‌న్నారు.“నారీ శ‌క్తి” విక‌సిత్ భార‌త్‌కు ఉప‌యోప‌డుతుంద‌న్నారు. మ‌నం తీసుకోబోయే నిర్ణ‌యాన్ని మ‌హిళ‌లు వీక్షిస్తున్నార‌ని,బిల్లును వ్యతిరేకించే వారి ఉద్దేశాల‌ను కూడా గ‌మ‌నిస్తున్నార‌న్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత ఆల‌స్యం చేయ‌వ‌ద్దని కోరారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుల‌తో ఏ రాష్ట్రానికి అన్యాయం జ‌ర‌గదు అని, ఎవ‌ర్నీ వివ‌క్ష‌పూరితంగా చూడ‌బోమ‌న్నారు.

మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ :- కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్  మాట్లాడుతూ, 2023లో పాసైన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ విధానాన్ని, జ‌నాభా లెక్క‌లు, డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ పూర్తి అయిన త‌ర్వాత అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.లోక్‌స‌భ‌లో స‌భ్యుల సంఖ్య‌ను 50 శాతం పెంచ‌నున్న‌ట్లు చెప్పారు.815 సీట్ల‌కు ఆ సంఖ్య చేరుకోనున్న‌ట్లు తెలిపారు. కోటాలో భాగంగా 272 సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దీని వ‌ల్ల ఏ రాష్ట్రం కూడా త‌మ ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, ప్ర‌స్తుతం ఉన్న ఆయా రాష్ట్రాల సామ‌ర్థ్యం అలాగే కొన‌సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. పురుషుల‌కు కానీ, రాష్ట్రాల‌కు కానీ తాజా బిల్లుల‌లో ఎటువంటి న‌ష్టం ఉండ‌బోద‌న్నారు. లోక్‌స‌భ సామ‌ర్థ్యం 815కి పెరిగిన‌ప్పుడు, దాంట్లో 33 శాతం అంటే 272 అవుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు.

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్

ఓటింగ్‌లో పాల్గొన్న 333 మంది ఎంపీలు

బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 207 ఓట్లు

బిల్లును ప్రవేశపెట్టడానికి  వ్యతిరేకంగా 126 ఓట్లు

3 కీలక బిల్లులు:- మూడు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తొంది.131 రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ…ఈ 3 కీలక బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *