నెహ్రూ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక మద్రాస్ బస్టాండ్ నెహ్రూ బొమ్మ ప్రాంతం నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణకు నిర్వహిస్తున్న మార్కింగ్ పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులకు వివిధ రకాల సూచనలు జారీ చేశారు. అనంతరం మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కెనాల్ ప్రాంతంలోని స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాంగణాన్ని కమిషనర్ పరిశీలించి వసతులను తనిఖీ చేశారు. కిసాన్ నగర్ ప్రాంతంలోని చేపల మార్కెట్ ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఫిష్ మార్కెట్ ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకునేలా నిర్వాహకులు, దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాధరావు, ఇంజనీర్ విభాగం డి.ఈ రఘురాం, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

