NATIONAL

బెంగాల్ లో ఆక్రమ నిర్మాణల పట్ల యూపీ సీఎం యోగి మోడల్‌ అమలు

డజన్ల బుల్ డోజర్లు…

అమరావతి: పశ్చిమ బెంగాల్‌ బీజెపీ ముఖ్యమంత్రి సువేందు, పాలన బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే యూపీ సీఎం యోగి మోడల్‌ను అమలు చేస్తున్న దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సంవత్సరాల తరబడి పాతుకుని పోయిన వారి పట్ల కఠినంగా వ్యమహరిస్తున్నారు. సిలిగురిలోని అక్రమ నిర్మాణాల్ని బుల్డోజర్లతో కూల్చివేసేందుకు భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రెండు డజన్ల బుల్డోజర్లను యూపీ ప్రభుత్వం నుంచి బెంగాల్ ప్రభుత్వం తెప్పిస్తోందని ఆయన వెల్లడించారు. అక్రమ నిర్మాణాల అంశంపై సిలిగురిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్, ఎస్పీ, ఇతర జిల్లాస్థాయి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడం, అక్రమ నిర్మాణాల్ని తొలగించడం, డ్రగ్స్‌ ను అరికట్టడం, అక్రమ మద్యం, బార్ షాపులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజు బిస్తా మాట్లాడుతూ, సిలిగురిలో అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిశాయని, వాటిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *