DISTRICTSPOLITICS

టీడీపీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు-కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు: వైసీపీ నాయకులు నోరుందని కదా అని ఇష్టప్రకారం మాట్లాడితే 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో 2029లో ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపీ నాయకులను హెచ్చరించారు.మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం అయన మాట్లాడుతూ ఈనెల 27,28,29వ తేదీలలో నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, ఇఫ్కో సెజ్ దగ్గర జరుగుతుందని, మొదటి రెండు రోజులు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది, మూడవరోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో మహానాడు పెడుతుంటే వైసీపీ నాయకులకు ఎందుకంత కలవరం అని సూటిగా అడిగారు. సొంత బాబాయిని చంపించినందుకు వై.ఎస్.షర్మిల… వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ అన్న మాటలకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.2019-2024 వరకు నెల్లూరు జిల్లాలో పెత్తనం చేసి, జిల్లాను సర్వనాశనం చేసిన చరిత్ర కాకాని గోవర్ధన్ రెడ్డిదంటూ మండిపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *