AP&TGCRIMEDISTRICTS

రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని తగుల పెట్టిన అధికారులు

పట్టుబడిన వారిపై పి డి యాక్ట్..

తిరుపతి: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కేజీల గంజాయిని కోర్టు అనుమతితో డిస్ పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.గురువారం మధ్యాహ్నం రేణిగుంట మండలం తుక్కివాకం వద్ద ఉన్న సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుల సమక్షంలో ఎలక్ట్రికల్ యంత్రం ద్వారా గంజాయి తగులబెట్టారు.

సుమారు రూ.20 కోట్ల విలువ:- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గడిచిన రెండు నుంచి మూడు సంవత్సరాల్లో 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువ గల 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకుని డిస్పోజ్ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు.

పట్టుబడిన వారి పై పి డి యాక్ట్:- జిల్లా ఎస్పి మాట్లాడుతూ పట్టుబడిన వారి పై పి డి యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. వివిధ విద్యా సంస్థలు, ఎన్జీవోలు, పోలీస్ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం, ఎటువంటి గంజాయికి స్థానం లేదని ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పని చేయడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి లు, డిఎస్పి లు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *