AP&TG

ద్రోణి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం

గూడూరులో 43.6డిగ్రీలు..

అమరావతి: రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం:- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి,  పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో  పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

మంగళవారం ఉష్ణోగ్రతలకు అవకాశం:- పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురంమన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు:- నెల్లూరు జిల్లా గూడూరులో 43.6డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 42.2, పల్నాడు జిల్లా మాచర్లలో 41.5, నంద్యాల జిల్లా సంజామల, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *