DISTRICTS

ఒక్క రూపాయికే డ్రైనేజీ కనెక్షన్,దోమలు లేని నగరంగా నెల్లూరు-మంత్రి నారాయణ.

నెల్లూరూ: కేవలం ఒక్క రూపాయికే డ్రైనేజీ కనెక్షన్ ఇస్తున్నామని, ప్రజల సహకారంతో నెల్లూరును దోమలు లేని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలపారు.బుధవారం 51వ డివిజన్ కపాటిపాళెంలో పర్యటించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటింటికీ ఉన్న మంచినీటి కుళాయిలను స్వయంగా పరిశీలించారు. డ్రైన్ల ఆధునీకరణ కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించడంతో స్థానిక ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.550 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.ఇప్పుడు మరో కోట్ల రూపాయలతో మళ్ళీ ప్రారంభించామని తెలిపారు. ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామన్నారు.జూలై కల్లా అమృత్ స్కీమ్ ద్వారా సంగం బ్యారేజీ నుండి ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జడ్పిటిసి విజేతారెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, మాజీ కార్పొరేటర్ దార జయ రాజు ,క్లస్టర్ మిదురి ప్రశాంత్ ,​కో-క్లస్టర్ ఇక్బాల్,కమటం ప్రశాంత్ ,​ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కుంద బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ ​కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్,అశోక్ ,స్థానిక టిడిపి జనసేన బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *