DISTRICTSEDU&JOBSOTHERS

క్రమశిక్షణతో ఉన్నత విద్యావంతులై ఆదర్శంగా నిలవండి-కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను కల్పించాలన్న ఉన్నత లక్ష్యంతో పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ ఆలోచనలతో ఏర్పాటు చేసిన వి.ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత విద్యావంతులుగా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని కమిషనర్ వై.ఓ. నందన్ ఆకాంక్షించారు. స్థానిక వి.ఆర్. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రాంగణంలో 180 మంది విద్యార్థులకు ప్రీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, మెడల్స్ ను సోమవారం అందచేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యతోపాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకటరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ, పి.ఈ.టి. గురు ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ జయలక్ష్మి, హరిత చంద్రకళ, ఎం.ఈ. ఓ.హమీద్, 436 మంది ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *