ట్రీ గార్డ్స్ లను దొంగిలించి స్క్రాప్ పాత ఇనుప సామాన్లకు అమ్మితే-కమీషనర్
ఫోను నెంబర్లకు సమాచారం ఇవ్వండి..
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం మాట్లాడుతూ నగరవ్యాప్తంగా నాటిన మొక్కలను సంరక్షించే ట్రీ గార్డ్స్ లను ఎవరైనా దొంగిలించి స్క్రాప్ పాత ఇనుప సామాన్ల దుకాణదారులకు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదివారం కొంత మంది 8,,10వ వార్డుల్లో ట్రీగార్డులను దొంగలించడంమే కాకుండా,నాటిన చెట్లను ధ్వసం చేశారని,ఈ విషయమై బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పాత ఇనుప సామాను దుకాణదారులు ఇటువంటి వస్తువులను కొనుగోలు చేయ వద్దని అలాగే దొంగిలించిన ట్రీ గార్డ్స్ కు సంబంధించిన సమాచారాన్ని కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగానికి తెలియజేయాలని కమిషనర్ సూచించారు.
గమనిక:ఈ క్రింది ఫోను నెంబర్లకు సమాచారము అందించగలరు.
Anusha (A.E) 7993794164—CCC TollfreeNo -08612356777,0861231677,18004251113.

