AP&TGPOLITICS

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది-ప్రధాని మోదీ

అమరావతి:ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నా ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ ఎక్స్​లో ట్వీట్​ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు. ప్రజా సేవ కోసం చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌:- గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నా, రాష్ట్రాభివృద్ధి కోసం మీకు అవసరమైన శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా’ అని గవర్నర్‌ అబ్దుల్​ నజీర్​ తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్:-  సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యత తీసుకున్నారని, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యాలను నిర్దేశించుకున్నారని పవన్‌ అన్నారు. పెట్టుబడులకు చిరునామాతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారని కొనియాడారు. మంచి ప్రభుత్వం నినాదం నిజం చేసేలా ఏపీ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందన్న పవన్‌, చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.

YS జగన్:-చంద్రబాబుకు,వైసీపీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మీకు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన దీర్ఘాయువు కలగాలని కోరుకుంటున్నాను! అని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *