జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ వద్ద బస్సు ప్రమాదం-21 మంది మృతి
అమరావతి: జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్‌లో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. ఈ సంఘటనలో 21 మంది మృతిచెందగా,61 మంది గాయపడ్డారు. రామ్‌నగర్ సమీపంలోని కాగోర్ట్ గ్రామం వద్ద ఉన్న మూలమలుపు దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అనేక మందిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. రామ్‌నగర్ గ్రామం నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర బస్సు లోయలోకి జారిపడినట్లు అధికారులు పేర్కొన్నారు. బస్సులో విద్యార్దులు, ఉద్యొగులు,వ్యాపారస్తులు వున్నారు.ఈ ప్రమాద సంఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు.

