రేపటి నుంచి ఉచితంగా ఇసుక,టన్ను రూ.370 మాత్రమే-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలోని వినియోగదారులకు సోమవారం నుంచి ఉచితంతగా ఇసుక సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు.జిల్లాలోని మూడు స్టాక్ యార్డుల్లో ప్రస్తుతం 1,75,301 టన్నుల ఇసుక అందుబాటులో వుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇసుక యార్డులకు ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తరలించి తీసుకుని వచ్చేందుకు అయ్యే నిర్వహణ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తుందన్నారు.టన్ను రూ.370 లకు విక్రయించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. స్లాక్ యార్డుల వద్ద వనియోగదారుడు ఎలాంటి నగదు చెల్లింపు చేయరాదన్నారు.ఇసుక విక్రయధరను వినియోగదారుడు స్టాక్ యార్డుల వద్ద వున్న QR కోడ్ ద్వారా స్కాన్ చేసి డిజిటల్ విధానంలో మాత్రమే చెల్లించాలన్నారు.యార్డులు ఉధయం 6 గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే తెరచి వుంటాని,ఆ సమయాల్లో ఇసుకను తీసుకుని వెళ్లవచ్చన్నారు.వినియోగదారుడు ఒక రోజుకు వారి ఆధార్ కార్డు మీద 20 టన్నుల మాత్రమే ఇసుకను విక్రయిస్తారన్నారు.ఇసుకను తీసుకుని వెళ్లెందుక వినియోగదారుడు స్వంతంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.ఇసుక యార్డుల వద్ద ఇచ్చే రవాణ అనుమతి పత్రంను వాహానల తనిఖీల సమయంలో రశీదు చూపించాల్సి వుంటుందన్నారు.గ్రామాల్లో వున్న వాగులు,వంకల్లో లభ్యమయ్యే ఇసుకను స్థానిక అవసరాల కోసం వినియోగించవచ్చన్నారు.అయితే ఏ గ్రామంలో వున్న వాగుల నుంచి ఆ గ్రామస్తులే ఎడ్లబళ్ల ద్వారా తీసుకుని వెళ్లెందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.