118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించాలి-గవర్నర్
అమరావతి: తమిళనాడు లోక్‌భవన్ వర్గాల ఆహ్వానంతో TVK అధినేత జోసెఫ్ విజయ్ గురువారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ అర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమ వద్ద ఉందని విజయ్ తెలిపినట్లు సమాచారం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు గవర్నర్‌తో విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీకి 107 సీట్లు గెలుచుకున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్ల వరకు అవసరం ఉన్న నేపథ్యంలో, తమకు మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేల గురించి గవర్నర్‌కు విజయ్ తెలియజేశారు.
విజయ్ ఇచ్చిన ప్రజెంటేషన్‌తో గవర్నర్ సంతృప్తి చెందలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.సంఖ్యా బలం అంశంలోనూ విజయ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఉన్న లేఖలను సమర్పించాలని గవర్నర్ కోరినట్లు తెలిసింది. డాక్యుమెంటరీ ప్రూఫ్ కావాలని గవర్నర్ అడిగారని లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించాలని ప్రత్యక్షంగా విజయ్‌ను గవర్నర్ అర్లేకర్ కోరినట్లు సమాచారం. మరి తమిళ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వెచి చూడాల్సిందే.
లోక్‌భవన్ ప్రకటన:- విజయ్ తో సమావేశం అనంతరం లోక్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.మెజార్టీ ఎమ్మేల్యే మద్దతు చూపించాల్సి అవసరంను,విజయ్ కు గవర్నర్ వివరించినట్లు లోక్‌భవన్ వెల్లడించింది.

