భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం పునర:ద్దరణ-చేజర్ల వేంకటేశ్వరరెడ్డి
నెల్లూరు: రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి,5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించే భవనాల యజమానులు నుండి ఒక శాతం సెస్ వసూలు చేసి ,సెస్ ద్వారా వచ్చిన నిధులను సంక్షేమ బోర్డుకు ఇచ్చి, దాని ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేశారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వరరెడ్డి అన్నారు.మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు కోసం గతంలో అమలవుతున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని నిలిపివేసి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో ఉన్న దాదాపు రూ.450 కోట్ల రూపాయలను దారి మళ్లించిందని తెలిపారు.కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 1 2026వ తేదీ న భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని వెల్లడించారు.ఈ పథకంలో గతములో సభ్యులుగా ఉన్న వారు రూ.60 కట్టి వారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని, కొత్తగా సభ్యులుగా చెరదలసిన వారు రూ.100 కడితే సభ్యత్వం ఇస్తారన్నారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని అన్నారు.
ప్రయోజనలు:- భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు లో సభ్యత్వం తీసుకొన్నవారు సహజ మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు రూ.60 వేలు ఆర్థిక సహాయం అందుతుంది.ఈ పథకం క్రింద వివాహం కానీ మహిళలు వివాహం చేసుకుంటే వారికి వివాహ ఖర్చులు క్రింద రూ.20 వేలు అందిస్తారు.అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ఆడపిల్లలు ఉండి వారికి వివాహం చేస్తే ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున కుటుంబానికి ఇద్దరికి వివాహ ఖర్చులు ఇస్తారు. మహిళా కార్మికులకు ప్రసూతి ఖర్చల క్రింద ఒక్కొక్క కాన్పుకు రూ.20 వేలు వంతున రెండు కాన్పులకు ఇస్తారు. ఈ పథకంలో సహజ మరణం చెందిన వారికి మట్టి ఖర్చుల క్రింద రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. కొత్త సభ్యత్వం తీసుకోదలదిన వారు తమ సమీపంలోని తమ సమీపంలోని సచివాలయం లోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు అని తెలిపారు.

