ఆంధ్రజ్యోతి విలేఖరిపై హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి-జర్నలిస్టు సంఘాలు
నెల్లూరు: చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ విలేఖరి జగన్మోహన్ రెడ్డిని కత్తులతో నరికి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడు ఐ మల్లికార్జున్,,నెల్లూరుజిల్లా APUWJ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షలు వెంకటేశ్వర్లు,రమేష్ బాబు,,ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలోనే నిందితుడు రౌడీషీటర్ తమీమ్,మరో వ్యక్తి కలసి వెంటాడి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టులపై, వారి ఆఫీసులపై దాడులు చేయడం ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, ఇతరులకు ఒక అలవాటుగా మారిందన్నారు. ఉదయం వార్త పేపర్ విలేఖరితో కలసి వాకింగ్ చేస్తున్న ఏబీఎన్ విలేఖరి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ముందుగా వెంటాడి పట్టుకుని కత్తులతో దారుణంగా దాడి చేయడంతో, తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దాడి సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విలేఖరికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తొంది. నిర్దాక్షిణ్యంగా నరికి హత్య చేసినట్లు స్థానికులు తలిపారన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని,హత్యకు గల కారణలు శోధిస్తూ, కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నరని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, విలేఖరిపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించేందుకు అన్ని సంఘాలు ముక్త కంఠముతో ఖండించాలని జర్నిలిస్టుల సంఘాలు కోరాయి.

