AP&TGPOLITICS

తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశంపార్టీయే-టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు

అమరావతి: కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు 2025 ఘనంగా మంగళవారం ప్రారంభమైంది..తెలుగుదేశం పార్టీ జెండాను ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు..అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుడిలా పోరాటం చేస్తానని,,పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్ర ప్రధేశ్ భవిష్యత్‌ను మారుస్తానని చెప్పారు..టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా, అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీలో చూసినా తెలుగు దేశం పార్టీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని,, టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు..పార్టీ కార్యకర్తల పోరాటం, త్యాగాలే నేటి అధికారమన్నారు.. పార్టీ పనైపోయిందన్న వాళ్ల పనైపోయింది తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందన్నారు.. విధ్వంస పాలనలో ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన శ్రేణులకు వందనం.

గడప కడపలో మన సత్తా చాటుదాం:- ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేమని,, కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించటంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.. మహానాడు వేదికగా సిద్దాంతాలు, విధానాలు, ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు.. దేవుడి గడప కడపలో జరిపే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు.. గత ఎన్నికల్లో కడపలో 10కి 7అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని,, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామ‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని మహానాడు వేదికగా స్పష్టం చేస్తున్నా నని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదనే అపోహ వద్దు.. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని చంద్రబాబు చెప్పారు.. గత వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పారదర్శకంగా విచారణ జరుగుతోంది.. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారు..శిక్ష ఆలస్యం కావొచ్చు కానీ అక్రమార్కులు తప్పించుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు..

మహానాడులో ఆరు శాసనాలు:- “నా తెలుగు కుటుంబం” ప్రకటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1. తెలుగు జాతి, విశ్వ ఖ్యాతి 2. పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్ 3. స్త్రీ శక్తి 4. అన్నదాతకు అండగా 5. యువగళం 6. కార్యకర్తే అధినేత అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *