బుధవారం మంచినీటి సరఫరాలో అంతరాయం-కమీషనర్ నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సంగం వద్దనున్న మహమ్మదాపురం ఫిల్టరేషన్ ప్లాంటు నుండి నెల్లూరు సిటీ వరకు మంచి నీటి సరఫరా జరుగుతుందని, 29వ తేదీ (బుధవారం) ఫిల్టరేషన్ ప్లాంట్ లోని బ్యాక్ వాష్ రిజర్వాయర్ యొక్క 750mm Dia DI వాల్ ను స్థానంలో కొత్త వాల్వ్ మార్చడంతో పాటు ప్లాంట్ ఫిల్టర్బెడ్ మరమ్మతులు చేయాల్సి ఉంటుందని నగరపాలక సంస్థ కమీషనర్ నందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ కింద తెలుపబడిన ఈ ELSR లకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.దిని కారణంగా 29వ తేదీన నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాయంత్రం నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని, మరల 30వ తేదీ అంటే గురువారం ఉదయం నీటి సరఫరా యధావిధిగా జరుగుతుందని కమీషనర్ తెలిపారు. నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు నగరపాలక సంస్థకు సహకరించవలసిందిగా కోరారు.

