ఖాళీ స్థలాలపై పన్ను చెల్లింపులో 50 శాతం రాయితీ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణదారులకు, భూ యజమానులకు వెసులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.Vacant Land Tax (VLT) ఖాళీ స్థలాలపై పన్ను చెల్లింపు విధానంలో సవరణలు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన చట్ట సవరణలకు అనుగుణంగా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారిక జీవోను విడుదల చేశారు. సవరణల ప్రకారం భవన నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం రాయితీ లభించనుంది. భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని, నిర్మాణం ప్రారంభించిన సమయం నుంచి ఆ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయ్యే వరకు ఈ 50 శాతం రాయితీ వర్తిస్తుంది. గతంలో నిర్మాణం జరుగుతున్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం సగానికి తగ్గించింది.

