రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా
అమరావతి: విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) బాధ్యతలు స్వీకరించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 5 సంవత్సరాల కాలానికి నియమితులైనట్లు తెలిపారు.

