తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
హైదరాబాధ్: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 IPS బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్,నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ SPగా పనిచేశారు.అటు తరువాత హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హోంసెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీగా వున్న శివధర్‌రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.

