వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం-200 ద్విచక్ర వాహనాలు అగ్నికి అహుతి
అమరావతి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్ లో శనివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 200 ద్విచక్ర వాహనాలు అగ్నికి అహుతి అయ్యాయి..అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు వెంటనే ఘటన స్థలంకు చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు..వాహనాల దగ్దం కారణంగా ఏర్పడిన దట్టమైన పొగతో సదరు ప్రాంతం అంత అలముకుంది.. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని,,దాదాపు 200 ద్విచక వాహనాలు దగ్దం అయ్యాయని జీఆర్పీ సీవో కున్వర్ బహుదూర్ సింగ్ మీడియాకు తెలిపారు.. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయా? లేక ఇతర కారణ వల్ల ఈ ఆగ్ని ప్రామధం చోటు చేసుకుందా ? అనే విషయంపై లోతుగా విచారణ చేస్తున్నమన్నారు..