ప్రభుత్వ నిర్వాకంతో 45 శాతం మేర పెరిగిన ధరలు-మంత్రి నారాయణ
8821.44 కోట్ల విలువైన పనులకు ఆమోదం..
అమరావతి: రాజధాని విషయంలో వైసీపీ మూడుముక్కలాటతో భారీగా ఆర్ధికభారం పెరిగిపోయిందని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు..సీఎం చంద్రబాబు సూచన మేరకు మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేసారు… మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 42వ అథారిటీ సమావేశం జరిగింది…ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు..42వ అధారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి మరో 8821.44 కోట్ల విలువైన ట్రంక్ రోడ్లు, లే అవుట్ లలో రోడ్లు వేసేందుకు అధారిటీ ఆమోదం తెలిపింది…ల్యాండ్ పూలింగ్ లే అవుట్ లలో రోడ్లకు 3807కోట్లు, ట్రంకు రోడ్లు కు 4521 కోట్లు, జడ్జిలు,మంత్రులు బంగ్లాలు పూర్తి చేసేందుకు 492 కోట్లు అదారిటీ ఆమోదించింది.. గతంలో జరిగిన 41వ అధారిటీ సమావేశంలో 11వేల 471 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం లభించింది..మొత్తంగా 20,292 కోట్ల 46 లక్షల మేర పనులు చేపట్టేందుకు అథారిటీ అనుమతిచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు..నేలపాడు, రాయపూడి, అనంతవరం,దొండపాడు వంటి గ్రామాల్లో 236కిలో మీటర్లు లేఅవుట్ రోడ్లకు అనుమతి లభించిందన్నారు.. మొత్తం రాజధానిలోని 360 కిమీ మేర ట్రంక్ రోడ్లు ఉండగా వాటిలో 97.5కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు.