మీడియా ప్రతినిధులపై దాడికి దిగిన మోహన్ బాబు
హైదరాబాద్: జల్‌పల్లి ఫామ్ హౌస్ లో మోహన్ బాబు కుటుంబ హైడ్రామా కొనసాగుతోంది..మోహన్ బాబు,,విష్ణులపై మంచు.మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా,,మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఇరు పక్షాల వారు ప్రైవేటు బౌన్సర్లను రక్షణగా వుంచుకోవడంతో,,ఒకరిపై ఒకరు మూష్టిఘాతలకు దిగుతున్నారు.. ఈ దృశ్యలను చిత్రికరించేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులపై మోహన్ బాబు మైక్ లాక్కొని ఆవేశంగా అతనిపై దాడి చేశాడు..మోహన్‌బాబు అకస్మాత్తుగా దాడి చేయడంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు..అనంతరం మీడియా ప్రతినిధులు, బౌన్సర్లను బయటకు పంపించేశారు..ఈ ఘటన తర్వాత మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు..మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో మోహన్‌బాబుతో పాటు మంచు విష్ణు వద్ద ఉన్న గన్‌ను కూడా సీజ్ చేయాలని ఆదేశించారు.. ఇంకా ఈ డ్రామా ప్రస్తుతం కొనసాగుతునే వుంది.