నెల్లూరు ప్రజల రుణం తీర్చుకుంటా-మంత్రి నారాయణ
నెల్లూరులో త్వరలో 200 ఈ-ఆటోలు..
నెల్లూరు: సిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు.ఆదివానం వేంకటేశ్వర పురంలో 40 లక్షలతో ఈ-ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నగరానికి వచ్చిన 200 ఈ-ఆటోలను ఈ నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని తెలిపారు.1.40 కోట్లతో రేబాల వారి వీధిలో నిర్మిస్తున్న పార్కును , ఏసీ ఫంక్షన్ హాల్, అత్యాధునిక జిమ్ పనులను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి తెలిపారు.
మహానాడుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి తప్పు పట్టారు.మహానాడు నిర్వహణ పూర్తిగా తమ పార్టీ అంతర్గత విషయమని, నెల్లూరులో ఇప్పటివరకు నిర్వహించని కారణంగానే తమ అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఇక్కడ నిర్వహిస్తున్నారని, దీనిపై ఇతరుల వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ షఫియ,టిడిపి ముఖ్య నేతలు ముజీర్,జహీర్,షాహీద్,జమీర్,తిరుమల నాయుడు,బీసీ బాబు,తదితరులు పాల్గొన్నారు.

