DISTRICTSPOLITICS

సీటీ నియోవర్గంలోని 53వ డివిజన్ లో మహానాడు-మంత్రి నారాయణ

పండుగవతావరణంలో..

నెల్లూరు: చరిత్రలో నిలిచిపోయేలా నెల్లూరులో మహానాడు నిర్వహించాలని భావించామని,పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన పొదుపులో భాగంగా భారత ప్రధాని మోదీ పిలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేశారని,వర్చువల్ మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడుకు విశేష స్పందన వచ్చిందన్నారు.

పార్టీ అధిష్ఠానం ఆదేశంతో నెల్లూరు సిటీ లోని 14 క్లస్టర్లలో వర్చువల్ మహానాడును పండుగలా నిర్వహించారు.53వ డివిజన్ లో నిర్వహించిన మహానాడులో మంత్రి నారాయణ,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పార్టీ అబ్జర్వర్ గురవారెడ్డి,నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించారు.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.జ్యోతిప్రజ్వలన చేసి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మహానాడులో చర్చించాల్సిన అంశాలపై క్లస్టర్ పరిధిలోని నేతలు,కార్యకర్తలకు మంత్రి నారాయణ దిశా నిర్దేశం చేశారు.అనంతరం మంత్రి మిగిలిన 13 క్లస్టర్లలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.సిటీ లో 14 క్లస్టర్లలో మహానాడు వేడుక పండుగవతావరణంలో జరుగుతోందన్నారు.కార్యకర్తలు,అభిమానులు,శ్రేయోభిలాషులు రెట్టింపు ఉస్తాహంతో పాల్గొన్నారని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *