గురువారం రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు,ఎండల తీవ్రత పెరిగే అవకాశం
అమరావతి: గురువారం మే 28 (గురువారం) రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
గురువారం అంచనా ఉష్ణోగ్రతలు:– 45°C – 46°C: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు. 43°C- 44°C: అల్లూరి,విశాఖ,అనకాపల్లి,బాపట్ల,పల్నాడు, మార్కాపురం,నెల్లూరు,ప్రకాశం. 40°C- 42°C: రాయలసీమ జిల్లాలు
బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు:– పార్వతీపురంమన్యం(జి) సాలూరులో 41.8 డిగ్రీలు, ఏలూరు(జి)కుక్కునూరు, పోలవరం(జి) కూనవరంలో 41.6 డిగ్రీలుగా నమోదు అయ్యాయి.

