ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..ఫైబర్ నెట్ కార్పోరేషన్‌లో జరిగిన అవినీతి బయటపడకుండా వుండేందుకు మధుసూధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది..ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు నమోదు అయ్యాయి..నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వున్నాయి..అలాగే మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని,,సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.. మధుసూధన్ రెడ్డి కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పేర్కొన్న ప్రభుత్వం,, హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవోలో పేర్కొంది.. ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా మధుసూదన్ రెడ్డి వ్యవహరించారంటూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది..ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ.800 కోట్ల మేర అవినీతి జరిగిందని రాష్ట్ర నలుమూల నుంచి ప్రభుత్వంకు ఫిర్యాదులు వెల్లువెల్తాయి..ఈ నేపధ్యంలో ఫైబర్ నెట్‌లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.. మధుసూదన్ రెడ్డి రైల్వే అకౌంట్స్ సర్వీసుల నుంచి 2019 అగష్టు 26వ తేదిన రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు.