NATIONALOTHERSWORLD

ఇరాన్ దెబ్బ-చెప్పుకుంటే సిగ్గు పొతుంది-తేలు కుట్టిన దొంగలా అమెరికా?

20 సైనిక కేంద్రాలు ధ్వసం..

అమరావతి: అమెరికా-ఇరాన్ ల మ‌ధ్య జరుగుతున్న యుద్దంలో ఇరాన్ కొట్టిన దెబ్బకు అమెరికాకు చెందిన దాదాపు 20 సైనిక కేంద్రాలు ధ్వసం అయ్యాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా అమెరికా పలు శాటిలైట్లపై అంక్షాలు విధించింది. అయినప్పటికి ధ్వసం అయిన స్థావరాలక చెందిన ఇమేజీలు బయటకు వచ్చాయి.

28 అమెరికా బేస్‌లు ధ్వంసం:- శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ ఒక అంచ‌నా వేసింది.అమెరికా స్థావరాలపై అనుకున్న దాని క‌న్నా ఎక్క‌వ స్థాయిలో దాడులు జ‌రిగాయ‌ని, అమెరికాకు భారీగానే న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఆ ఇమేజ్‌ల ద్వారా అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌శ్చిమాసియాలో ఉన్న 8 దేశాల‌ను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ దాడులు వ‌ల్ల అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్‌, రీఫుయ‌లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌, రేడార్లు ధ్వంసం అయ్యాయి. అయితే ఇరాన్ షేర్ చేస్తున్న ప్లానెట్ సంస్థ శాటిలైట్ ఇమేజ్‌ల‌పై అమెరికా నిషేధం విధించింది. ఇత‌ర అంత‌ర్జాతీయ ప్రొవైడ‌ర్ల ద్వారా శాటిలైట్ ఇమేజ్ లను తీసుకున్న సదరు మీడియా సంస్థ‌, ప్లానెట్ కంపెనీకి చెందిన పాత ఇమేజ్‌ల‌తో పోల్చింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌, ఇరాక్‌, జోర్దాన్‌, బ‌హ్రెయిన్‌, ఒమ‌న్ దేశాల్లో ఉన్న అమెరికా కేంద్రాల‌ను ఇరాన్ టార్గెట్ చేసింది. కొన్ని సంస్థ‌ల అంచ‌నా ప్ర‌కారం సుమారు 28 అమెరికా బేస్‌లు ధ్వంసం కావడంతో పాటు ఖ‌రీదైన కంప్యూటర్ హార్డ్‌ వేర్ డ్యామేజ్ కూడా జ‌రిగింది.

రౌండ్‌కు 12.7 మిలియ‌న్ల డాల‌ర్లు:- యూఏఈలోని అల్ రువాయిస్‌, అల్ స‌ద‌ర్‌తో పాటు జోర్దాన్‌లో ఉన్న మువాఫ‌క్ సాల్టీ ఎయిర్‌బేస్‌ను డ్యామేజ్ చేశారు. అమెరికా యాంటీ మిసైల్స్ వ్యవస్థ అయిన టాడ్ ను ఉపయోగిస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని ప్ర‌దేశాల్లో థాడ్ బ్యాట‌రీల‌ను మోహ‌రించింది. ఆ బ్యాట‌రీల‌ను ఆప‌రేట్ చేయాల‌టే క‌నీనం`100 మంది టెక్నిషన్లు కావాల్సి వుంటుంది.మిసైల్ ఇంట‌ర్‌సెప్టార్ ఖ‌రీదు రౌండ్‌కు 12.7 మిలియ‌న్ల డాల‌ర్లు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా రీఫుయ‌లింగ్‌, నిఘా విమానాల‌పై ఇరాన్ చేసిన దాడితో అవి కూడా ధ్వసం అయినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా స్ప‌ష్టంగా అంచ‌నా వేశారు.

దాదాపు 700 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన E-3 సెంట్రీ నిఘా ప్లేన్‌ను కూడా పేల్చిన‌ట్లు గుర్తించారు. కువైట్‌లో ఉన్న అలీ అల్ స‌లీమ్ ఎయిర్‌బేస్‌తో పాటు క్యాంప్ అరిఫ్‌జాన్‌లో ఉన్న బేస్‌ను కూడా ఇరాన్ ధ్వసం చేసింది. సైట్ వ‌ద్ద ఫ్యూయ‌ల్ స్టోరేజ్ బంక‌ర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగ‌ర్లు, ట్రూప్ అకామిడేష‌న్ ప్రాంతాలు ధ్వంసం అయిన‌ట్లు మ‌లార్ శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు.దింతో అమెరికాకు జరిగిన నష్టం బిలియన్ల డాలర్లతో వుండడంతో, తేలు కుట్టిన దొంగల వ్యవహరిస్తొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *