CRIMENATIONAL

కారు ట్యాంకులో నింపింది 41 లీటర్ల పెట్రోల్-52 లీటర్లు పెట్రోల్ నింపినట్లు బిల్లు

మోసాన్ని బయటపెట్టిన కారు యాజమని..

దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయి.తూనికలు-కొలతల శాఖలకు సంబంధించిన అదికారులు మాత్రం,మొద్దు నిద్ర పోతున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ఈ నేపధ్యంలో…ఒక కారు యజమాని తనకు జరిగిన ఆన్యాయంను సోషల్ మీడియా వేదికగా బయల పెట్టారు…వివరాల్లోకి వెళ్లితే……..

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌,హర్ష్ నగర్‌లొని పెట్రోల్ బంకుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వోక్స్‌ వ్యాగన్ కారు యజమాని చరణ్ సింగ్ అనే వ్యక్తి తన వోక్స్‌ వ్యాగన్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 45 లీటర్లు అయినప్పటికీ, అందులో 52 లీటర్లకు పైగా పెట్రోల్ నింపారని ఆరోపించారు.దీంతో అధికారులు రంగంలోకి దిగారు. చరణ్ సింగ్ ఇటీవలే కొత్త కారును కొనుగోలు చేశాడు. అతడు పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. ట్యాంక్‌లో సుమారు ఐదు లీటర్ల పెట్రోల్ మిగిలి ఉన్నట్లు ఫ్యూయల్ ఇండికేటర్ చూపించింది.

అందులో 5 లీటర్ల పెట్రోల్‌ ఉన్నది:- తన కారులో ట్యాంక్‌ ఫుల్‌గా పెట్రోల్‌ నింపమని బంకు సిబ్బందిని చరణ్‌ సింగ్‌ కోరాడు. ఆ కారు ట్యాంక్‌ పూర్తి సామర్థ్యం 45 లీటర్లు. అందులో 5 లీటర్ల పెట్రోల్‌ ఉన్నది. అయినప్పటికీ 52 లీటర్ల పెట్రోల్‌ నింపినట్లు బంకు సిబ్బంది బిల్లు ఇచ్చాడు. ఇది చూసి కారు యజమాని చరణ్‌ సింగ్‌ షాక్‌ అయ్యాడు. దీని గురించి బంకు సిబ్బందిని నిలదీశాడు.

41 లీటర్ల పెట్రోల్‌ను బంకు సిబ్బంది:- ఇదే సమయంలో మొదట కారు ట్యాంకులో 41 లీటర్ల పెట్రోల్‌ను బంకు సిబ్బంది నింపినట్లు చరణ్‌ సింగ్‌ గ్రహించాడు. ఆ తరువాత మీటర్‌ రీడింగ్‌ను మార్పు చేసి అదనంగా 11 లీటర్లు నింపినట్లు బిల్లులో చూపినట్లు ఆరోపించాడు. ఈ మోసాన్ని బయటపెట్టేందుకు కారు తయారీ సంస్థ ప్రతినిధిని అక్కడకు పిలిపించాడు.ఆ కారు కంపెనీ ప్రతినిధి ఆ పెట్రోల్‌ బంకు వద్దకు చేరుకున్నాడు. కారు ట్యాంక్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్‌ పట్టదని అధికారికంగా ధృవీకరించాడు. దీంతో చరణ్‌ సింగ్‌ ఆ పెట్రోల్‌ బంకుపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మోసపూరిత చిప్‌లు, డిస్పెన్సింగ్ యంత్రాల తనిఖీ కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *