మధ్యతరగతి,యువత,పేదలు,రైతులకు ప్రాధన్యం కల్పించిన సీతారామన్ బడ్జెట్
ధరలు తగ్గనున్న పలు విభాగలు..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,రాష్ట్రపతి ద్రౌపదిముర్మని కలిసి బడ్జెట్ గురించి వివరించారు..అనతంరం శనివారం ఉదయం 11 గంటలకు 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు..దీంతో వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు..
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.. పలు రంగాలకు కేటాయింపుల గురించి వివరించారు.. మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సరికొత్త ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట వేసింది..దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం తీసుకొస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు..దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు.. కోటి 70లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు..
గోడౌన్లు, నీటిపారుదల, రుణాల కల్పన, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు..కంది,, మినుములు,,మైసూర్ పప్పు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు..పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రవేశ పెడుతున్నారు..స్టార్టప్‌ల కోసం 20 కోట్ల వరకు MSMEలకు 10 కోట్ల వరకు రుణాలిచ్చేందుకు నిర్ణయించారు.. కస్టమ్స్ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు..బీమారంగంలో వంద శాతం FDIలకు అవకాశం కల్పించారు.. క్యాన్సర్ ఔషధాలు,, సర్జికల్ పరికరాలపై సుంకాలు తగ్గించారు..లిథియం బ్యాటరీలపై పన్ను తొలగింపుతో Led టీవీలు,,మొబైల్,,ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి..
కొత్త పన్ను శ్లాబులు సవరణలను ప్రతిపాదించారు:- రూ.0-4 లక్షలు-0.0,,రూ.4 నుంచి 8 లక్షలకకు 5%,, రూ.8 నుంచి 12 లక్షలకు 10%,,రూ.12 నుంచి16 లక్షలకు 15%,,రూ.16 నుంచి 20 లక్షలకు 20%,,రూ.20 నుంచి 24 లక్షలకు 25%,,రూ.24 లక్షలకు పైన 30 శాతం పన్ను విధిస్తారు..
ఈ సందర్భంలోనే TDS,,TCS రేట్లను కూడా భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు..వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు.. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించారు..
ఇన్‌కమ్ ట్యాక్స్:- కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్న నేపధ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.. వచ్చే వారం పార్లమెంట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్( ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపు పన్ను) బిల్లు ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు..ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.. ఇన్‌కమ్ ట్యాక్స్ లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని తెలిపారు..అలాగే పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో UPI లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు..
ప్రతి జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలు:-200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు..2025-26 సంవత్సరంలోనే క్యాన్సర్ కేంద్రాలు..
ధరలు తగ్గనున్న పలు విభాగలు:-చేనేత వస్త్రాలు,,తోలు వస్తువులు,,మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ,,ఎలక్ట్రిక్ వెహికల్స్,,భారతదేశంలో తయారైన దుస్తులు,,వైద్య పరికరాలు,,క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు,, పలు రకాల ఖనిజాలు.
షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకో సిస్టమ్ ఏర్పాటు.. IIT,,IIS విద్యార్థులకు రూ.10 వేల కోట్ల ఉపకార వేతనాలు.. జ్ఞానభారత మిషన్ ఏర్పాటు..ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు..రాబోయే 10 సంవత్సరాల్లో 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులకు సౌకర్యం..చిన్నస్థాయి అణురియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్.. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం..రూ.20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్.. 2030 నాటికి నాలుగు చిన్న, మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు..దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి 2వ ప్రణాళిక..రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు..ప్రభుత్వం, ప్రైవేటు, పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్..అభివృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్..కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.