NATIONAL

రాహుల్ గాంధీ ఆస్తులు రూ.20.39 కోట్లు, ఖర్చులకు రూ.60 కోట్లు-సంబిత్

ఎక్కడి నుంచి వస్తున్నాయి?..

అమరావతి: కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. గురువారం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాహుల్ గాంధీని నిలదీశారు. ఈ సందర్బంలో సంబిత్ మాట్లాడుతూ… రాహుల్‌కు సంవత్సరానికి వచ్చే వార్షిక ఆదాయాలకు, ఆయన విదేశీ పర్యటనలకు చేస్తున్న ఖర్చులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. ఫారిన్ పర్యటనల్లో చేస్తున్న ఖర్చులకు నిధుల ఎక్కడి నుంచి వస్తున్నయనేది రాహుల్ వెల్లడించాలని సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గత 22 ఏళ్లలో 54 విదేశీ ట్రిప్పులకు వెళ్లారని, వాటి మొత్తం ఖర్చు రూ.60 కోట్ల దాకా అయిందన్నారు.

ఆస్తులు రూ.20.39 కోట్లు, ఖర్చులు రూ.60 కోట్లు??- రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం,2004లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.55.38 లక్షలు.2024 నాటికి మొత్తం ఆస్తుల విలువ రూ.20.39 కోట్లకు పెరిగింది. అంటే గత 22 ఏళ్లలో (2004 నుంచి 2026 వరకు) ఆస్తుల విలువ రూ.55.38 లక్షల నుంచి రూ.20.39 కోట్లకు చేరింది. అయితే 22 ఏళ్ల వ్యవధిలో రాహుల్ గాంధీ 54 విదేశీ పర్యటనలకు దాదాపు రూ.60 కోట్లను ఖర్చు చేశారు. రూ.20.39 కోట్ల ఆస్తులకు, రూ.60 కోట్ల విదేశీ పర్యటనల ఖర్చులకు లెక్క సరిపోవడం లేదన్నారు.ఈ విదేశీ పర్యటనలకు ఎవరు నిధులను సమకూర్చారో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వెల్లడించాలి అని సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *