టీటీడీ సేవలపై భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలను మెరుగుపర్చుకోవాలి-సీ.ఎం
వకులమాత కేంద్రీకృత వంటశాల..
తిరుమల: తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలి,,కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు,, ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు,, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశనిర్దేశన చేశారు. శనివారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పద్మవతి అతిధి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో సీ.ఎం మాట్లాడుతూ తిరుమలలో భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని,,ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అన్నారు..అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.. టీటీడీ సేవలపై భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలను మెరుగుపర్చేవిధంగా టీటీడీ పనిచేయాలన్నారు.. అలాగే ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు..తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని,, సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలే తప్ప ఆర్భాటం, అనవసర వ్యయం చేయవద్దన్నారు.. తిరుమల పేరు తలిస్తే….ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలని చెప్పారు..సమీక్షకు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరు అయ్యారు.
వకులమాత కేంద్రీకృత వంటశాల:- అనంతరం ఉదయం 8.30 గంటలకు తిరుమల పాంచజన్యం వెనుక వైపున రూ.13.75 కోట్లతో నూతనంగా నిర్మించిన వకులమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభోత్సవం చేసి వంటశాలను పరిశీలించారు.