జిల్లాలో 10 లక్షలమంది యోగా మీద మక్కువతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు-జె.సి కార్తీక్
నెల్లూరు: మానసికంగా, శారీరకంగా అద్భుత ప్రయోజనాలు కలిగించే యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కె కార్తీక్ పిలుపునిచ్చారు.యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన రెసిడెన్షియల్ థీమాటిక్ రాష్ట్రస్థాయి సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 లక్షలమంది యోగా మీద మక్కువతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పారు.
జిల్లాలో 124మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వీరిద్వారా సుమారు 7000మందికి గ్రామ,వార్డుస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వీరంతా గ్రామ,వార్డుస్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 9న గ్రామ, వార్డుస్థాయిలో యోగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ కూడా యోగాను ఒక దినచర్యగా మార్చుకోవాలనేది ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కలెక్టర్ చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లాలో 2వేల ప్రదేశాల్లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, జిల్లా క్రీడాప్రాధికారసంస్థ అధికారి యతిరాజ్, జిల్లా ఆయూష్ అధికారి గోవిందయ్య, యోగాగురువులు తదితరులు పాల్గొన్నారు.