NATIONAL

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతీయ రైల్వే ఇంజినీరింగ్ అద్భుతం..

మ్మూకశ్మీర్‌ లోయలోని అందాలను చూడాలి అంటే ఉదమ్‌పూర్.. శ్రీనగర్.. బారాముల్లా మధ్య నేడు ప్రారంభం అయిన చినాబ్‌ రైల్వే బ్రిడ్జి నుంచి ప్రయాణించాల్సిందే..ఈ ప్రయాణంలో పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను వేరు చేస్తూ,, వంతెనలు, సొరంగాల దాటుకుంటు ఈ రైల్వే లైన్‌ గమ్యానికి చేరుస్తుంది..

అమరావతి: భారత దేశం  చిరకాలం కోరిక నేరవేరింది..భారత్,చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మించింది.. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలువబడుతున్నఈ బ్రిడ్జి శుక్రవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు..అనంతరం ఉదమ్‌పూర్.. శ్రీనగర్.. బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు..చినాబ్‌ రైల్వే బ్రిడ్జి,, కుతుబ్‌ మినార్‌ ఎత్తు 72 మీటర్లు, ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు ఉంటే, రివర్‌ బెడ్‌ నుంచి చినాబ్‌ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు ఉంటుంది..ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు.. గంటకు 266 కి.మీ వేగంతో గాలులు వీచినా వంతెన చెక్కుచెదరదు..అంతే కాకుండా ప్యారిస్‌లోని ప్రపంచ వింత అయిన ఈఫిల్‌ టవర్‌ను మరిపించేలా చినాబ్‌ రైల్వే వంతెన ఉంటుంది..చినాబ్‌ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్‌ బ్రిడ్జ్‌.. చినాబ్‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణం అందుబాటులోకి రావడంతో కట్రా-శ్రీనగర్‌ మధ్య 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది..ఈ చినాబ్‌ రైలు వంతెనపై నుంచి వెళ్లే కట్రా-శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా పచ్చజెండా ఊపి ప్రారంభించారు.. జమ్మూ ప్రాంతంలోని కట్రా రైల్వే స్టేషన్‌కు ప్రధాని రాక సందర్భంగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో పకడ్భంది ఏర్పాట్లను చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *