3 రోజుల పోలీసు కస్టడీకి వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు కోర్టు న్యాయమూర్తి అదేశాలు ఇచ్చారు..6వ తేదీ ఉదయం 10:30 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు.. గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని నెల్లూరు కోర్టు జడ్జి అదేశాల్లో పేర్కొన్నారు..కాకణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ ఇనుప ఖనిజ గనుల తవ్వకం, భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి.