భారీ వర్షాలు-అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం-ఐఎండీ
అమరావతి: నైరుతి రుతుపవనాలు శుక్రవారం వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ & బీహార్, అలాగే ఒడిశా & జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ అధికారలు పేర్కొన్నారు.
రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ & పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, ఒడిశా, జార్ఖండ్ & బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలు-ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-
దక్షిణ కోస్తా:-
శనివారం—తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి ,తేమ-అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
రాయలసీమ:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
