DISTRICTS

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి-జాయింట్ కలెక్టర్, కమిషనర్

కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

నెల్లూరు: ప్రతి జీవికీ జీవనాధారమైన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణా చర్యలలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి.వెంకటేశ్వర్లు, కమిషనర్ వై.ఓ నందన్ లు ఆకాంక్షించారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీని శుక్రవారం ఉదయం నిర్వహించారు. స్థానిక వి.ఆర్ కళాశాల కూడలి నుంచి ఏ.సి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మీదుగా వి.ఆర్.సి వరకు నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న వారితో పర్యావరణహిత ప్రతిజ్ఞను చేయించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వి.ఆర్ కళాశాల ప్రాంగణం మైదానం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతలను వారు చేపట్టారు.పర్యావరణ పరిరక్షణా ర్యాలీలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ అశోక్ కుమార్, అధికారులు, నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట (తూకివాకం) సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వానమహోత్సవం కార్యక్రమంలో చైర్మన్ సి.దివాకర్ రెడ్డి, జేసి ఆర్ గోవింద్రావుతో కలిసి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *