NATIONALPOLITICS

అన్నామ‌లై రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించిన బీజెపీ అధ్యక్షడు నబిన్

అమరావతి: త‌మిళ‌నాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు అన్నామ‌లై స‌మ‌ర్పించిన‌ రాజీనామాను ఆ పార్టీ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ ఆ రాజీనామాను అంగీక‌రించిన‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే భ‌విష్య‌త్తులో ఏం చేయాల‌నుకుంటున్నారో అన్నామ‌లై, ఇవాళ మీడియాతో వెల్ల‌డించ‌నున్నారు. అన్నామ‌లై రాజీనామాతో బీజేపీ మంచి నాయకుడిని వదులుకుంది. త‌మిళ‌నాడుకు చెందిన మాజీ పోలీసు ఆఫీస‌ర్ అన్నామ‌లై,, 2020 ఆగ‌స్టులో బీజేపీలో చేరారు.అయన పార్టీలో చేరిన తరువాత తమిళనాడు బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షడిగా బాధ్యతలు అప్పగించిన బీజెపీ అధిష్టానం,సంవత్సరం తరువాత తమిళనాడు బీజెపీ రాష్ట్ర అధ్యక్షడిగా పదవీ కట్టపెట్టింది.తన రాజీనామ అమోదం పొందిన తరువాత అన్నామాలై, తమిళ ప్రజలు,తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడదల చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *