AP&TGDEVOTIONALOTHERS

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం-10.33 ఎకరాల భూమి-టీటీడీ

ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం..

తిరుపతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ మంగళవారం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఈ భూమిని అస్సాం ప్రభుత్వం కేటాయించింది. గతంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ పాలకమండలి కూడా అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు.

త్వరలో భూమిపూజ:- గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకి, అస్సాం ప్రభుత్వానికి టీటీడీ ఛైర్మన్, ఈవోలు టీటీడీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *