DISTRICTS

సాగునీరు, రైతాంగ సమస్యలపై కీలక నిర్ణయాలు-జిల్లా సమీక్షా సమావేశం

3 బస్తాలకు పెరిగిన యూరియా కోటా..

చింతలదేవి బ్రీడింగ్ సెంటర్‌కు 2-3 నెలల్లో నీటి వసతి..

నెల్లూరు: నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా ఇన్‌ఛార్జ్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా సమావేశం ముగిసింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు నారాయణ,రామనారాయణరెడ్డిల,రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు

ఇన్చార్జ్ మంత్రి  ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ:- రాబోయేది ఖరీఫ్ సీజన్ కావడంతో ఎక్కువగా వ్యవసాయం, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ మత్స్య శాఖలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.నెల్లూరు జిల్లాలో పొగాకు పండిస్తున్నప్పటికీ పొగాకు బోర్డులో సభ్యత్వం తగిన గుర్తింపు లేకపోవడంపై ఒక తీర్మానాన్ని ఆమోదించామన్నారు. జొన్న పంటకు ప్రభుత్వం 3,699 మద్దతు ధర ప్రకటిస్తే, మార్కెట్లో 2,700 నుండి 3,000 లోపే పలుకుతుండటంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని, మొక్కజొన్న కొనుగోళ్లపై కూడా చర్చించామన్నారు. వీటితో పాటు MSME రంగంలో ఉన్న భూవివాదాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని, నీరు వృథా కాకుండా ప్రతి చుక్కను రైతులకు అవసరమైన మేరకే విడుదల చేయాలని అధికారులను అదేశించినట్టు తెలిపారు.

ఒంగోలు జాతి ఎద్దులను కాపాడుకోవడానికి గతంలో ప్రభుత్వం 2,500 ఎకరాల భూమిని కేటాయించి ఏర్పాటు చేసిన చింతలదేవి బ్రీడింగ్ సెంటర్‌కు, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కామధేను ప్రాజెక్టుకు గతంలో నీటి వసతి కల్పించకుండా వదిలేశారని, రాబోయే 2-3 మాసాల్లో పూర్తి చేసి నీటి వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ వ్యవసాయం, నీటి పారుదల రంగాలపైనే సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు . రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి గతంలో యాప్ ద్వారా ఒక రైతుకు మొదట రెండు బస్తాల చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ, 3 బస్తాలకు పెంచుతూ ప్రభుత్వం అంగీకరించిందనే శుభవార్తను తెలియజేశారు.ఈ సమావేశంలో ఎంఎల్ఏలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,ప్రశాంతి రెడ్డి,కురుగొండ్ల రామకృష్ణ,కావ్య కృష్ణారెడ్డి,పాశం సునీల్ కుమార్,ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *