నాడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు-నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు-ముఖ్యమంత్రి
ప్రజల ఒక తిరుగులేని హెచ్చరిక చేశారు..
ప్రధాని మోదీ చేయూతను మరువలేం..
తిరుపతి: 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గెలుపుగా కాకుండా… బాధ్యతగా భావిస్తూ పాలన మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయగా…
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పు ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో సారి గుర్తు చేశారు.
శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో రెండేళ్ల పాలనపై జరిగిన విజయోత్సవ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు.ఈ సందర్బంలో సీ.ఎం,డిప్యూటివ్ సీ.ఎంలు మాట్లాడారు… 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరుతో చేపట్టిన ఈ సభలో పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్న కేంద్రం.. చేయూతనందిస్తున్న ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండేళ్ల కాలంలో డబుల్ ఇంజిన్ సర్కార్ చేసిన ప్రగతిని వివరించడంతోపాటు… రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.రెండేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ఇచ్చిన పిలుపునకు మద్దతు పలికారన్నారు. ప్రజలు చూపిన విజ్ఞతతో డబుల్ ఇంజన్ సర్కార్ గెలిచింది. రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు విజ్ఞత చూపారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టాం. ఎన్డీఏ ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
పవన్ కళ్యాణ్:- సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు… అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు.
