DISTRICTSPOLITICS

NDA బహిరంగ సభలో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి-జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో ఒక రోజు పర్యటించనున్న నేపథ్యంలో జూన్ 12న తిరుపతికి విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా శుక్రవారం ఉ.10.30 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం ఉ.10.50 గం.లకు తిరుపతి రూరల్ మండల పరిధిలో గల దామినేడు సమీపంలో ఏర్పాటు చేసిన రీజినల్ స్థాయి ఎన్ డి ఏ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. కార్యక్రమం ముగించుకుని మద్యాహ్నం 01.15 గం.లకు తాజ్ హోటల్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారన్నారు. అనంతరం మ.3.00 గం.లకు తాజ్ హోటల్ నుండి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మ.3.30 గం.లకు విజయవాడ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *