వితండవాదం,ఆహంకారం ఫలితం రూ.9 వేల కోట్లు రాష్ట్రం చెల్లించింది-సీ.ఎం బాబు
అమరావతి: గతంలో ప్రభుత్వం పాలన వెలగ పెట్టిన ఓ వ్యక్తి(మాజీ సీ.ఎం) ఆహంకారంతో రూ.9 వేల కోట్లను సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.గురువారం అసెంబ్లీలో సీ.ఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఎలా నాశనం చేసిందో ఇది ఒక ఉదాహరణ. ఆలోచన లేకుండా పీపీఏలను రద్దు చేసి అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు తీసారన్నారు..ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనల కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను,తదపరి ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర అభివృద్ది సాధ్యం అవుతుందని,,అయితే ముందు ప్రభుత్వం తీసుకుని నిర్ణయాలను ఆహంకారంతో అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేశారు..ఇందుకు పైన సంఘటనను ఉదహరించారు.