దక్షిణకోస్తా&రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 14వ తేది ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి వాయువ్య దిశగా గంటకు 12 కిమీ వేగంతో కదులుతుందని ఏ.పి విపత్తుల నిర్వహణసంస్థ ఎం.డి.రోణంకి కూర్మనాథ్ బుధవారం తెలిపారు..ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 360 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ, నెల్లూరుకి 450 కి.మీ దూరంలో ఉందన్నారు.. వాయుగుం డం గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు..దీని ప్రభావంతో బుధవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని,,దక్షిణ కోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..గురువారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని,,తీరం వెంట గంటకు 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..