కోనసీమలో రైల్వే కూత వినిపించాలని ప్రజల కోరికను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తా-పవన్
పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాలు..
అమరావతి: ప్రపంచ రికార్డు సృష్టించిన గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు..సోమవారం గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది..ఈ పండుగను కృష్ణాజిల్లా కంకిపాడు నుంచే ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఈ కార్యక్రమం అనంతరం పవన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తరువాత పరిపాలన,, రాజకీయాలు వేర్వేరుగా చూడాలన్నారు..వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడైనా ప్రజా సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు.. “వైసీపీ హయాంలో151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు.. వారెప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా? ఎంతసేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానరాలేదు”అని విమర్శించారు..
“ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధులు చెల్లింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పాటు చేశాం.. మేము పారదర్శకంగా ఉన్నప్పటికీ.. అధికారులు కూడా బాగా పని చేయాలి.. ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి నా పేరు చెప్పి డబ్బులు అడగినట్లు తెలిసింది.. నా దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం.. అవినీతి అధికారులు మాకు వద్దు. ఎవరు లంచం పేరుతో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి.. మేము ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం.. అభివృద్ధి చేయడం మా బాధ్యత.. కంకిపాడులో కూడా డిస్ ప్లే బోర్డులు ఉంటాయి.. ప్రజలందరు వివరాలు తెలుసుకోవచ్చు.. దేశ చరిత్రలో గ్రామ సభలు, అభివృద్ధి పనులు ఒకేసారి జరగడం ఆంధ్రప్రదేశ్ లోనే చూడవచ్చన్నారు.. అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాలలో పనులు ఇవాళ ప్రారంభం అయ్యాయి.. పనులు పూర్తి కావాలంటే.. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి.. పరిపాలన ఎలా చేయాలనే అంశంలో నాకు సీఎం చంద్రబాబునాయుడు స్పూర్తి.. క్యాబినెట్ సమావేశాల్లో చంద్రబాబు బలంగా మాట్లాడతారు..కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు.. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి చూస్తాం..
ప్రధాని మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.. అలా అని తరచూ వెళ్లి కలవలేను. కోనసీమలో రైల్వే కూత వినిపించాలని ప్రజల కోరిక.. బాపట్ల, మచిలీపట్నం, కోనసీమ ప్రాంతాల సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్తా.. నేను మాట ఇస్తే నిలబడే వ్యక్తిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కొన్ని సమస్యలు చెప్పారు.. అందరిలా చేసేద్దాం అని మాటలు చెప్పను.. అందుకే అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం వెతుకుతాను అని చెప్పారు.