CRIMENATIONAL

నాగ్‌పూర్ మత హింసలో నిందితుడైన షాహిమ్ ఖాన్‌‌కు చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేత

అమరావతి: నాగ్‌పూర్ మత హింసలో కీలక నిందితుడైన షాహిమ్ ఖాన్‌‌కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.. సోమవారం ఉదయం 10.30 గంటలకు షాహిమ్ ఖాన్ నివాసంతో పాటు అతడికి చెందిన ఇతర నిర్మాణాలను మున్సిపల్ అధికారులు 3 బుల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు..మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ (MDP)కి చెందిన నాయకుడు షాహిమ్‌ ఖాన్,,నాగ్‌పూర్ అల్లర్లకు కారకుడయ్యాడని,,రాజద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ప్రస్తుతం ఖాన్ జైలులో ఉన్నారు..నాగ్‌పూర్ యశోధ్‌నగర్‌ ప్రాంతంలోని సంజయ్‌బాగ్ కాలనీలో ఉన్న నివాసం, ఖాన్ భార్య పేరుమీద రిజిస్ట్రర్ అయి ఉంది..అక్రమ ఇంటి నిర్మాణాలపై NMC హెచ్చరికలు చేస్తూ నోటీసులు ఇచ్చినప్పటకీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో ఆ భవనాలను కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు.. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

మార్చి 17న ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో జరిగిన నిరసనల సందర్భంగా మతపరమైన శాసనాలు ఉన్న ‘చాదర్’ దహనం చేయబడిందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశాడని,,ఈ రకమైన పుకార్లు వ్యాపించడంతో నాగ్‌పూర్‌లో హింస చెలరేగిందని పోలీసులు FIRలో పేర్కొన్నారు..ఈ ఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు దహనానికి పాల్పడడంతో ఈ అల్లర్లలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు సహా మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు..సోషల్ మీడియాలో వదంతులకు కారణమైన షాహిమ్‌ ఖాన్ సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది..అలాగే దాదాపు 50 మంది నిందితులపై సైబర్ విభాగం నమోదు చేసిన నాలుగు FIRలోనూ వీరి పేర్లు ఉన్నాయి..ఈ ఘర్షణలకు సంబంధించి 200 మంది నిందితులను గుర్తించామని,, మరో 1000 మందిని సీసీఫుటేజ్ ఆధారంగా గుర్తించనున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *