జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా
ఎమ్మెల్యే బాలరాజు మందలింపు..?
అమరావతి: కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవ శ్రీధర్ తెలిపారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందించారు. శనివారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడితో, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన పలు ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తన వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్‌కు తెలిపారు.
వ్యక్తి గత వివాదం:- కొన్ని రోజులుగా హర్ష వీణ, ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం రాష్ట్రంలో వార్తల్లో నిలిచింది. తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది.
మందలింపు:- శనివారం నాడు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజులను మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమావేశం అయిన సందర్బంలో పవన్ కల్యాణ్ వీరిద్దరిని గట్టిగా మందలించినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ ఇద్దరిపైనా వస్తోన్న వ్యక్తిగత ఆరోపణల నేపధ్యంలో వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తొంది.
4 వారాల సమయం:- పద్దతులు మర్చుకునేందుకు పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యే బాలరాజు తన వ్యక్తిగత వివాదాలను సరిదిద్దుకునేందుకు 4 వారాల సమయం ఇచ్చారని సమాచారం. ఇలాంటి అంశాలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకూడదని పవన్ కల్యాణ్ సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

